సంగీతం ప్రాణం పోస్తుందని తెలుసు. చాలామందికి పాటలు వింటే తప్ప నిద్ర పట్టదు. కానీ సంగీతం కూడా ప్రాణాలను తీస్తోంది. నమ్మశక్యంగా లేదా.. ఇది నిజం. ఒక మహిళ సంగీతం మీద ప్రేమే ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. చెన్నైలో ఒక మహిళ పాటలు వింటూ నిద్రపోయింది. కానీ అదే ఆ
సంగీతం ప్రాణం పోస్తుందని తెలుసు. చాలామందికి పాటలు వింటే తప్ప నిద్ర పట్టదు. కానీ సంగీతం కూడా ప్రాణాలను తీస్తోంది. నమ్మశక్యంగా లేదా.. ఇది నిజం. ఒక మహిళ సంగీతం మీద ప్రేమే ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. చెన్నైలో ఒక మహిళ పాటలు వింటూ నిద్రపోయింది. కానీ అదే ఆమె శాశ్వత నిద్రకు దారితీసింది.
సంగీతంపై వున్న అభిమానం చెన్నైలో ఫాతిమా అనే మహిళ ప్రాణాలను బలిగొంది. చెన్నైలోని కణ్ణత్తూర్‌కు చెందిన ఫాతిమా అనే మహిళ హెడ్ ఫోన్స్ పెట్టుకుని సంగీత వింటూ నిద్రపోయింది. ఉదయం ఎంతకూ భార్య నిద్రలేకపోవడంతో భర్త అబ్దుల్ ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ఎంతకూ నిద్రలేవకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు.
ఆమె ప్రాణాలతో ఉన్న సూచనలేవీ కనబడకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఫాతిమాను పరీక్షించిన వైద్యులు చనిపోయిందని చెప్పారు. ఆమె మరణానికి సెల్ ఫోన్ షార్ట్ షర్య్కూట్ కారణమని నిర్ధారించారు. పోలీసులు కూడా అసహజ మరణంగా కేసును నమోదు చేసుకున్నారు.