Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రేప్‌'కు యత్నించిన స్వామీజీ.. దాన్ని కోసిపారేసిన యువతి... ఎక్కడ?

కేరళ రాష్ట్రంలో ఓ కామాంధుడిపై ఓ యువతి ధైర్యంగా ఎదురుతిరిగింది. తనపై అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించిన స్వామీజి మర్మాంగాన్ని యువతి కోసిపారేసింది.

Webdunia
శనివారం, 20 మే 2017 (12:21 IST)
కేరళ రాష్ట్రంలో ఓ కామాంధుడిపై ఓ యువతి ధైర్యంగా ఎదురుతిరిగింది. తనపై అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించిన స్వామీజి మర్మాంగాన్ని యువతి కోసిపారేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... కొల్లాంకు సమీపంలోని పద్మన అనే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి గణేషానంద తీర్థపద స్వామి(54) అలియాస్ హరి ఆశ్రమానికి క్రమం తప్పకుండా వెళుతూ ఉండేది.
 
అయితే, ఈ స్వామిపై నమ్మకం కుదరడంతో ఆశ్రమంలో తల్లిదండ్రులతో కలిసి యువతి ఉంటూ సేవలు చూస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన స్వామీజీ... తనకు సేవలు చేసుకునేందుకు నియమించుకున్నాడు. అలా ఆ యువతితో వ్యక్తిగత సేవలు పొందుతూ వచ్చిన దొంగబాబా... యువతిని లైంకికంగా వేధిస్తూ వచ్చాడు. 
 
ఈమధ్యకాలంలో అతని ఆగడాలు మరింతగా శృతిమించిపోయాయి. శుక్రవారం రాత్రి ఏకంగా యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వద్దని ఎంత చెప్పినా బాబా వినకుండా తనపై దారుణానికి యత్నించడంతో అతడి పురుషాంగాన్ని కోసిపారేసింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేసింది. 
 
పోస్కో చట్టం కింద అతడిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ గణేషానంద స్వామి తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments