Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి లేడీ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:43 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఇపుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
 
నీముచ్ జిల్లాలో ఈ నెల ప్రారంభంలో ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా పరిచయమైన ప్రధాన నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తనతో వాట్సాప్‌లో చాట్‌ చేస్తున్నట్లు చెప్పింది. 
 
అతని సోదరుడి పుట్టిన రోజు పార్టీకి తనని ఆహ్వానించాడని, ప్రధాన నిందితుడితోపాటు అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. 
 
దీనిని వీడియో తీశారని, ప్రధాన నిందితుడి తల్లి, మరో వ్యక్తి తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశారని, చంపుతామని కూడా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం