Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంకు బాగోతం తెలిసిందనీ భర్తను చంపి పెరట్లోనే పాతిపెట్టిన భార్య!

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (12:25 IST)
తాను ఓ యువకుడితో కొనసాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధం భర్తకు తెలియడంతో కట్టుకున్నోడు అని చూడకుండా తన ప్రియుడుతో కలిసి చంపేసింది. శవాన్ని బయటకు ఎక్కడైనా పాతిపెడితే తెలుసిపోతుందని భావించిన ఆమె.. ఏకంగా ఇంటి పెరట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా పూవరసం కుప్పంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని విక్రవాండి సమీపాన ఉన్న పనయకపురానికి చెందని సహాయం అనే వ్యక్తి కుమారుడు లియోబాల్‌(31)కు సుజిత మేరి (25) అనే యువతితో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యతో కలిసి లియోబాల్‌ పూవరసం కుప్పంలో నివసిస్తున్నాడు. 
 
ఈ కుప్పానికి చెందిన రాధాకృష్ణన్ అనే 22 యేళ్ళ యువకుడిత లియోబాల్‌కు పరిచయమైంది. కొద్దికాలంలోనే ఇద్దరూ స్నేహితులయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీన బంధువుల పెళ్లికని వెళ్లిన లియోబాల్‌ తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై లియోబాల్‌ తండ్రి సహాయం ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21వ తేదీన సుజితమేరీ, రాధాకృష్ణన్‌ అదృశ్యమయ్యారు.
 
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా సుజితమేరీ, రాధాకృష్ణన్‌ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం భర్త లియోబాల్‌ గుర్తించడంతో అతడిని హత్య చేసి ఇంటి పెరట్లోనే పాతిపెట్టినట్లు వెల్లడైంది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments