Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు బస్సులో కరోనా సోకిన దంపతులు.. ప్రయాణీకులు పరుగో పరుగు

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (19:55 IST)
Corona in Bus
తమిళనాడు బస్సులో కరోనా సోకిన దంపతులు ప్రయాణిస్తున్నారని తెలిసి మిగిలిన ప్రయాణీకులు పరుగులు తీశారు. తమిళనాడు కడలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు కడలూరు జిల్లాలోని బన్రుట్టి నుంచి వడలూరుకు ప్రయాణికులతో వెళ్తోంది. సమయం సరిగ్గా మద్యాహ్నం 12:15లకు బస్సులో ఉన్న ఇద్దరు దంపతులకు ఒక ఫోన్ వచ్చింది. వారిద్దరికీ కోవిడ్-19 పాజిటివ్ అని ఆ ఫోన్ ద్వారా తెలిసింది. 
 
అంతే బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ సహా 15 మంది ప్రయాణికులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్ కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి దంపతులు అంతకు ముందు రోజే కోవిడ్-19 టెస్ట్ కోసం నమూనాలు ఇచ్చారు. 
 
అయితే ఆ పరీక్షలో వారికి పాజిటివ్ అని తేలే సరికి.. వారిని ఆసుపత్రికి తీసుకుపోవడానికి వారి ఇంటికి ఆసుపత్రి సిబ్బంది వెళ్లారు. వారు అక్కడ లేకపోవడంతో వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. సరిగ్గా అదే సమయానికి వారు ఆర్టీసీ బస్సులో ప్రయాణంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments