Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రగత్తె చెప్పింది...! తల్లిదండ్రులు పాటించారు..!! రెండు రోజుల చిన్నారికి నడక

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (11:56 IST)
దేవుడు చెప్పాడు.. అరుణాచలం పాటించాడు..ఈ డైలాగ్ రజనీకాంత్ చెబుతుంటే ఈలలు, కేకలు మార్మోగిపోతాయి. అయితే ఆ తరువాత అది ఎంతటి నిజమో ఎవరికి తెలుసు..? అది సినిమా కాబట్టి తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ ఆ మంత్రగత్తె ఒక్క మాట చెప్పిందంటే గ్రామాలకు గ్రామాలు పాటిస్తాయి. ఒక్క అడుగు కూడా పక్కకు వేయరు. అది ప్రమాదమని తెలిసినా సరే ఏ మాత్రం వెనుకాడరు. మంత్రిగత్తె చెప్పిందని తల్లిదండ్రులు తమ రెండు రోజుల కొడును మెడపట్టుకుని నడిపించారంటే ఇంతకంటే మూఢనమ్మకాలు ఏముంటాయనిపిస్తుంది. మరింత జ్వరంతో పుట్టిన బిడ్డ ఆసుపత్రిపాలయ్యాడు. అస్సాంలోని ఓ మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
అస్సాంలోని మోరిగాన్ గ్రామంలో ఆ బాలుడికి తీవ్రమైన జ్వరం వస్తుండడంతో తలిదండ్రులు ఓ మంత్రగత్తెను ఆశ్రయించారు. బాలుడిని పరీక్షించిన తరువాత జ్వరం తగ్గాలంటే ఇలా బలవంతంగా, బట్టలు లేకుండా నడిపించాలని ఆ మంత్రగత్తె చెప్పిందట. ఇక ఆ మంత్రగత్తె చెప్పిందే ఆలస్యంగా నిరక్షరాస్యులు, మూఢాచారాలను నమ్మే ఆ పేరెంట్స్ అలాగే చేశారు. 
 
తల్లిదండ్రులు పిల్లాడికి బట్టలు తీసేసి మెడపట్టుకుని నడిపించారు. దీంతో పిల్లాడికి జ్వరం మరింత ఎక్కువైంది. జరిగిన ఈ ఘటనను ఎవరో మొబైల్‌లో చిత్రీకరించి పోలీసులకు పంపారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరుకుని ఆ మంత్రగత్తెను అరెస్టు చేసి శిశువును ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ చిన్నారి కోలుకుంటున్నాడు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments