ఎన్డీయేతో శివసేన తెగతెంపులు: ఆ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్న ఉద్ధవ్?

ఎన్డీయే ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకోనుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంతో మూడేళ్లుగా కలిసి ముందుకు సాగుతున్న శివసేన త్వరలో ఆ కూటమితో తెగదెంపులు చేసుకోనుందనే సంకేతాలను శ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (12:02 IST)
ఎన్డీయే ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకోనుందని జాతీయ  మీడియాలో వార్తలొస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంతో మూడేళ్లుగా కలిసి ముందుకు సాగుతున్న శివసేన త్వరలో ఆ కూటమితో తెగదెంపులు చేసుకోనుందనే సంకేతాలను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. 
 
ఎన్డీయేతో కలిసి ముందుకు సాగాలా? వద్దా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను బలాన్నిస్తున్నాయి. గతంలోని ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తన నిర్ణయాలను పదేపదే మార్చుకుంటోందని ఎద్దేవా చేశారు.
 
అయితే తామెరికీ అల్టిమేటం ఇవ్వాలనుకోవడం లేదని, కూటమితో తెగదెంపులు చేసుకోవాలనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉద్ధవ్ అన్నారు. అంతేగాకుండా తాము ప్రజా సేవకే కట్టుబడి ఉన్నామని, అలాగే ముందుకు వెళ్తామని ఉద్ధవ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments