Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ElectionResults : గోవాలో బీజేపీ గెలిస్తే... ముఖ్యమంత్రిగా మళ్లీ మనోహర్ పారీకర్?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (08:43 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే నెలకొంది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినట్టు ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో వెల్లడైంది. దీంతో ఈ రాష్ట్ర ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఇదిలావుండగా, 40 స్థానాలున్న గోవాలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 39 స్థానాల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ దాని బలం ఐదు లేదా ఆరు స్థానాలకే పరిమితం కావచ్చని తెలుస్తోంది. ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేసిన మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ, గోవా సురక్ష మంచ్‌, శివసేనలు చీల్చే ఓట్లు ప్రధాన పార్టీల జయాపజయాలను నిర్దేశించనున్నాయి. ఈ కూటమి కాంగ్రెస్‌ కన్నా భాజపాకే ఎక్కువ నష్టం కలిగించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు గోవాలో భాజపా మళ్లీ విజయబావుటా ఎగురవేస్తే కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ మళ్లీ సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచార భారమంతటినీ పారికర్‌ తన భుజాలపై వేసుకున్నారు. దీంతో బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ పారీకర్‌నే సీఎం చేయాలన్న వాదన ఓ వర్గం బీజేపీ నేతల్లో బలంగా ఉంది. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం వద్ద కూడా వారు ప్రస్తావించినట్టు సమాచారం. అయితే, భాజపా తన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాగా, 2012లో భాజపా 21 స్థానాలను గెలుచుకుని ఆధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

సామాన్యులే సెలబ్రిటీలుగా డ్రింకర్ సాయి టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments