Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్‌ను ఏడాదిన్నరలోపు రద్దు చేస్తాం.. ప్రభుత్వ జోక్యం అవసరం లేదు!

వాట్సాప్ ద్వారా, పోస్టల్ రూపంలో తలాక్ చెప్పేసి.. భార్యాభర్తల సంబంధాలను తెగతెంపులు చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరుతూ... ముస్లిం మహిళలు కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అయితే ట్రిపుల్ తలాక్‌

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (15:37 IST)
వాట్సాప్ ద్వారా, పోస్టల్ రూపంలో తలాక్ చెప్పేసి.. భార్యాభర్తల సంబంధాలను తెగతెంపులు చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరుతూ... ముస్లిం మహిళలు కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అయితే ట్రిపుల్ తలాక్‌ను తొలగించే అంశంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించింది. 
 
ఏడాదిన్నరలోపు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేస్తామని లా బోర్డు ఉపాధ్యక్షుడు డా. సయీద్‌ సాధిఖ్ తెలిపారు. ట్రిపుల్‌ తలాక్ రద్దుకు చాలా తక్కువ మంది మహిళలే మద్దతిస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించిన సాధిఖ్.. కేంద్ర ప్రభుత్వం, కోర్టు జోక్యం చేసుకోవడంతో వెంటనే స్పందించారు. ఈ విధానాన్ని రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 
 
ఇదిలా ఉంటే.. ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచ్ మే 11వ తేదీ నుంచి వాదనలను విననుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై తీవ్ర చర్చలు జరుగుతుండగా ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ ట్రిపుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరు తలాక్ తలాక్ తలాక్ అని మూడు సార్లు అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదన్నారు. ముస్లిం మహిళలు ఖురాన్ చదవాలని సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments