Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటైన్స్ డే రోజు ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్తను చూసిన భార్య.. ఆ తరువాత?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (20:41 IST)
తనకు పెళ్ళయ్యింది.. పిల్లలున్నారన్న విషయం మర్చిపోయాడేమో పాపం. వాలెంటైన్స్ డే కావడంతో ఏకంగా ప్రియురాలిని వెంటపెట్టుకుని తెగ ఎంజాయ్ చేసేందుకు సిద్థమయ్యారు. బెంగుళూరు సిటీలో ముఖ్యమైన ప్రాంతాలను తిరిగేందుకు సెలవు కూడా పెట్టేశాడు. ఇంకేముంది బైక్ పైన ప్రియురాలిని ఎక్కించుకుని బెంగుళూరు మెజిస్టిక్ దగ్గరలోని ఫాస్ట్ పుడ్ దగ్గరకు వచ్చాడు. ప్రియురాలితో కలిసి టిఫిన్ చేసేందుకు కూర్చున్నాడు. అయితే భార్య ఆ హోటల్లో ప్రత్యక్షమైంది. ఇంకేముంది?
 
బెంగుళూరు నగరంలోని టిన్ ఫ్యాక్టరీ సమీపంలో రాజేంద్ర నివాసముండేవాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె ఉంది. ఈరోజు వాలెంటైన్స్ డే కావడంతో తనతో పాటు పనిచేసే ఉద్యోగినితో కలిసి ఎంజాయ్ చేయడానికి సిద్థమయ్యాడు రాజేంద్ర. ఇద్దరూ కలిసి సెలవు పెట్టారు. ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్ళొస్తానని భార్యకు చెప్పిన రాజేంద్ర నేరుగా మెజిస్టిక్‌కు వెళ్ళాడు. ఒక ఫాస్ట్ పుడ్ సెంటర్‌కు తన ప్రియురాలిని రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తూ మాటల్లో మునిగిపోయారు.
 
ఇంతలో రాజేంద్ర భార్య అక్కడ ప్రత్యక్షమైంది. రాజేంద్రపై గతంలోనే అనుమానం ఉన్న భార్య అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు భర్తను ఫాలో అయ్యింది. దీంతో దొరికిపోయాడు రాజేంద్ర. తింటున్న రాజేంద్రను చెడామడా రెండు చెంపలు ఛెళ్లుమనిపించింది భార్య. హోటల్లో ఉన్నవారికి అసలేమీ అర్థం కాలేదట. దీంతో బిక్కముఖం వేసుకుని చూస్తూ కూర్చుండి పోయారు. ప్రియురాలు ఉండటంతో అక్కడి నుంచి పారిపోలేక అలాగే నిల్చుండిపోయాడు రాజేంద్ర. కొద్దిసేపటి తరువాత అక్కడున్న వారికందరికీ అసలు విషయం అర్థమైంది. దీంతో ఇది వారి కుటుంబ సమస్య అనుకుని అందరూ సైలెంట్‌గా ఉండిపోయారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments