Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అక్రమ సంబంధం... అనుమానంతో హత్యచేసిన భార్య..!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (10:20 IST)
కట్టుకున్న భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ భార్య అతనిని హత్య చేయించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ శివారు ప్రాంతం గజియాబాద్లోని గాంగ్ నహర్లో గురువారం అర్థరాత్రి దాటాక ఈ సంఘటన చోటుచేసుకుంది.

దిల్షాద్, రబియా ఇద్దరు భార్య భర్తలు. అయితే, దిల్షాద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రిబియా అనుమానించింది. దాంతో భర్తను అంతమొందించేందుకు ఆమె స్నేహితురాలు హబియా, ఆమె భర్త మౌజుద్దీన్‌ల సాయం తీసుకుంది.
 
దీంతో వారు ముగ్గురు కలిసి పథకం వేసి,  ఓ కిరాయి హంతకుడిని మాట్లాడి ముందస్తుగా పదివేలు చెల్లించి మర్డర్ ప్లాన్ అమలు చేశారు. రాత్రి భోజనం చేసిన అనంతరం రబియా తన భర్తకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి వెళ్లగానే ఆమె స్నేహితురాలు హబియా, హబియా భర్త మౌజుద్దీన్, కిరాయి హంతకుడు నూర్ మహ్మద్ కలిసి దిల్షాద్ గొంతునులిమి హత్య చేశారు. అనంతరం అతడికి బుర్ఖా వేసి శవాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు, భార్య రబియాను అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ జరుపుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments