Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఎన్‌క్లోజర్‌లో ఉన్న సీత - అక్బర్ సింహాల పేర్లు మార్చాల్సిందే.. హైకోర్టు బెంచ్ ఆదేశాలు

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (08:43 IST)
ఒకే ఎన్‌క్లోజర్‌లో సీత, అక్బర్ అనే రెండు సింహాలు ఉన్నాయి. ఈ రెండింటి పేర్లను మార్చాలంటూ హైకోర్టు బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇటీవల త్రిపుర నుంచి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి రెండు సింహాలు తరలించారు. వీటిలో ఒక ఆడ సింహానికి సీత, మగ సింహానికి అక్బర్ అనే పేర్లు పెట్టారు. ఈ పేర్లపై విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేశారు. ఇలాంటి పేర్లు పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అంటూ వారు పిటిషిన్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ రెండు సింహాల పేర్లు మార్చాలని ఆదేశించింది. 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి సఫారీ పార్క్‌లో అక్బర్, సీత అనే రెండు సింహాలు ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అంటూ కోల్‌కతా హైకోర్టు జల్పాయిగురి బెంచ్‌ పలువురు విశ్వహిందూ పరిషత్ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెస్ట్ బెంగాల్ అటవీశాఖ అధికారులో ఈ మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని పేర్లు పెట్టారని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు జల్పాయిగురి బెంచ్... ఈ పేర్లు మార్చాలంటూ ఆదేశిస్తూ, ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని జస్టిస్ సౌగతా భట్టాచార్య స్పష్టం చేశారు. 
 
కాగా, ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపించారు. ఈ రెండు సింహాలను త్రిపురలోని సిపాహీజాలా జులాజికల్ పార్కు నుంచి బెంగాల్‌కు తరలించారని, వాటికి త్రిపులలోనే పేర్లు పెట్టారని తెలిపారు. పేర్లను మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments