Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనాను ఎవరు చంపారు.. మీ లక్ష్యం ఏంటి.. పీటర్ ముఖర్జియాకు ప్రశ్నలు...

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (10:24 IST)
షీనా బోరా హత్య కేసులోని మిస్టరీని చేధించేందుకు ముంబై పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా భారత మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా వద్ద సుదీర్ఘ విచారణ జరిపారు. బుధవారం వర్లీలోని సొంత నివాసం నుంచి ఖర్ పోలీసు స్టేషన్‌కు ఉదయం 10.30 గంటలకు వచ్చిన పీటర్ వద్ద 9 గంటల సుదీర్ఘ విచారణ జరిపారు. ఆ సమయంలో పోలీసులు పలు రకాలైన ప్రశ్నలు కురిపించారు. 
 
ముఖ్యంగా ఇంద్రాణికి, ఆమె పిల్లలు షీనా, మైఖేల్‌కు ఎలాంటి సంబంధాలు ఉండేవిని ప్రశ్నించారు. అలాగే, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు ఇంద్రాణికి, మీకు (పీటర్) మధ్య సంబంధాలు ఉండేవా అని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో కూడిన ఓ ప్రశ్నపత్రావళిని కూడా పీటర్‌కు పోలీసులు అందజేసి సమాధానాలు రాబట్టారు. అలాగే, గురువారం కూడా ఆయన వద్ద విచారణ జరుపుతామని వెల్లడించారు. 
 
ముఖ్యంగా షీనా - రాహుల్ నిశ్చితార్థంపై మీ అభిప్రాయం ఏంటి అని పీటర్‌ను ప్రశ్నించారు. అసలు షీనా బోరాను హత్య చేసింది ఎవరని భావిస్తున్నారు. ఈ హత్య వెనుక లక్ష్యమేంటి, షీనా కనిపించకుండా పోయిన తర్వాత ఎందుకు మౌనంగా ఉండిపోయారు వంటి ప్రశ్నలు సంధించారు. వీటన్నింటికీ పీటర్ ముఖర్జియా సావధానంగా సమాధానమిచ్చినట్టు సమాచారం. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments