Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ మరణవార్త సాయంత్రం 5.30 గంటలకే ఆయనకు తెలిసింది.. ఆయనెవరో తెలుసా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే ఆమె చనిపోయినట్టు మొదటి తెలిసింది ఎవరికో తెలుసా.? శవపేటికలు తయారు చేసే కంపెనీ ఫ్లైయింగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపె

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (11:31 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే ఆమె చనిపోయినట్టు మొదటి తెలిసింది ఎవరికో తెలుసా.? శవపేటికలు తయారు చేసే కంపెనీ ఫ్లైయింగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీ ఎండీ శాంతకుమార్‌కు. జయలలిత చనిపోయి విషయం సోమవారం రాత్రి 11.30 గంటలకు ప్రకటిస్తే... అంతకుముందుగానే అంటే సోమవారం సాయంత్రం 5.30 గంటలకో శవపేటిల తయారీ కంపెనీ ఎండీకి తెలిసింది. పైగా ఈ విషయాన్ని బయటకు పొక్కకూడదంటూ ఆయనకు స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత శాంతకుమార్ స్వీయ పర్యవేక్షలో కఫిన్‌తో కూడిన హెవీ డ్యూటీ ఫ్రీజర్ బాక్స్ గంటల వ్యవధిలోనే తయారు చేసి.. అపోలో ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత జయలలిత మరణ వార్తను రాత్రి 11.30 గంటల సమయంలో ప్రకటించారు. 
 
ఇకపోతే ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినట్టు అధికారికంగా అపోలో ఆస్పత్రి ప్రటించకముందే శశికళతో పాటు, జయలలిత దూరం పెట్టిన వారంతా ఆమె చుట్టూ చేరారు. తెల్లవారు జామున 2.30 గంటలకు ఆసుపత్రి నుంచి జయ పార్థివ దేహం పోయెస్ గార్డెన్‌కు చేరుకుంది. అక్కడ కూడా జయలలిత బంధువులెవరికీ అవకాశం ఇవ్వకుండా శశికళ, ఆమె భర్త నటరాజన్, శశికళ బంధువులు ఇళవరసి, సుధాకర్, రావణన్, దివాకరన్ శవం చుట్టూ చేరిపోయారు. అక్కడి నుంచి రాజాజీ హాల్‌కు, మెరీనా బీచ్ ఒడ్డున అంతిమ సంస్కారం పూర్తయ్యే వరకు కూడా జయ భౌతికకాయం చుట్టూ గుమికూడి వేరెవరికీ చోటేలేకుండా చేశారు. ఖననం చేసే సమయంలో మాత్రం జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడు దీపక్‌ను మాత్రం శశికళ దగ్గర పెట్టుకుని అంత్యక్రియల తంతు ముగించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Kissik Song- ఏడు కోట్లు ఆదా చేసిన శ్రీలీల.. ఎలా?

బరువెక్కుతున్న కేతిక శర్మ హృదయ అందాలు.. కుర్రాళ్లు ఫిదా!

ఎర్రచీర దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ

బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా అభినవ్ చిత్రం - భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

అజిత్ తో మూవీ తర్వాతే కంగువ 2 చేస్తాం, దీపిక పడుకోన్ నాయిక కాదు : కేఈ జ్ఞానవేల్ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments