Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళా కాదు.. కరోనా ఆటం బాంబు : వర్మ సెటైర్లు

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (16:55 IST)
కరోనా వైరస్‌తో పాటు కుంభమేళాపై సెటైర్లు వేశారు. మంగ‌ళ‌వారం ఉగాది సంద‌ర్భంగా ట్విట‌ర్‌లో శుభాకాంక్ష‌లు చెబుతూనే వ‌రుస ట్వీట్లు చేశారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఆయ‌న కుంభ‌మేళాపై చేసిన ట్వీట్లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. 
 
ఇది హరిద్వార్ కుంభ‌మేళా కాదు క‌రోనా ఆటం బాంబు అంటూ మొద‌లు పెట్టిన వ‌ర్మ‌.. ఇన్ని ల‌క్ష‌ల మందిలో కేవ‌లం 26 మందికి మాత్ర‌మే పాజిటివ్ వ‌చ్చిందంటే మ‌నంద‌రం పార్టీ చేసుకోవాలంటూ ముగించారు.
 
కుంభ‌మేళాను క‌రోనా ఆటంబాంబుతో పోల్చిన వ‌ర్మ‌.. ఈ వైర‌ల్ పేలుడుకు ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. కుంభ‌మేళా.. గుబ్ బై ఇండియా, వెల్‌క‌మ క‌రోనా అని మరో ట్వీట్ చేశారు. 
 
కుంభ‌మేళా నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు మాస్కులే అవ‌స‌రం లేద‌ని, వాళ్లు ఇప్ప‌టికే గంగ‌లో త‌మ వైర‌స్‌ను విడిచి వ‌చ్చేశారంటూ ఇంకో ట్వీట్‌లో వ‌ర్మ అన్నారు.
 
అటు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేపైనా వ‌ర్మ సెటైర్లు వేశారు. దీనిని నేను లాక్డౌన్ అన‌ను అన్న థాక్రే వ్యాఖ్య‌ల‌పై ట్వీట్ చేస్తూ.. దానికి ఇంకో పేరు పెడుతున్నాను, అంద‌రూ బార‌సాల కార్య‌క్ర‌మానికి రావాలి, గిఫ్ట్‌లు తీసుకురావ‌డం మ‌ర‌చిపోవ‌ద్దు అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments