Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాద హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్ ఎక్కడ?

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (07:09 IST)
భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక ఎంఐ17వి5 విమానం బుధవారం తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ మరో 11 మంది చనిపోయారు. అయితే, ఈ అత్యాధునిక హెలికాఫ్టర్ మంటల్లో కూలి బూడిదైపోయింది. 
 
ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్ కోసం ఆర్మీ అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ బాక్స్ దొరికిన పక్షంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి ముందు ఏం జరిగిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా లభించే సమాచారంతో ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడర్ ఎల్ఎల్ లిద్దర్. లెఫ్టినెంట్ కర్నల్ హర్‌జిందర్ సింగ్, ఎస్కే గురుసేవక్ సింగ్, ఎన్కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, బి.సాయితేజ, హవ్ సత్‌పాల్‌తో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురు పేర్లు తెలియాల్సివుంది. పైగా, వీరంతా కున్నూరు సుల్లూరు ఎయిర్ బేస్‌కు చెందిన సిబ్బందిగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments