Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి తలను బలివ్వ‌మ‌ని కాళీమాత కోరిందనీ.. అన్నంత పని చేసిన తనయుడు

ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. ఆ కలలు వచ్చినట్టుగా కొందరు నిజజీవితంలోనూ నడుచుకుంటారు. మరికొందరు ప్రాక్టికల్‌గా కూడా ప్రవర్తింటారు. తాజాగా కాళికామాత కలలోకి వచ్చి తల్లి తలను బలివ్వమని కోరిందనీ ఓ యువకుడ

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (17:17 IST)
ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. ఆ కలలు వచ్చినట్టుగా కొందరు నిజజీవితంలోనూ నడుచుకుంటారు. మరికొందరు ప్రాక్టికల్‌గా కూడా ప్రవర్తింటారు. తాజాగా కాళికామాత కలలోకి వచ్చి తల్లి తలను బలివ్వమని కోరిందనీ ఓ యువకుడు.. తల్లి తలను తెగనరికి తల్లికి కానుకగా ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో దారుణ ఘ‌ట‌న జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన ఓ యువకుడు... క్షుద్రపూజలు చేస్తూ ఉండేవాడి. ఇతనికి కాళికామాత కలలోకి వచ్చి తల్లి తలను బలి ఇవ్వ‌మ‌ని చెప్పింద‌ట. దీంతో కాళీమాత ఆలయం ఆవరణలో నిద్రిస్తున్న త‌న త‌ల్లిని మెడ‌ను బ్లేడుతో పూర్తిగా కోశాడు. ఆ త‌ర్వాత‌ తన సోదరుడి ఇంటికి వెళ్లి, ఆ విష‌యాన్ని చెప్పాడు. దీంతో ఆయన త‌న‌ తల్లి కోసం కాళీమాత ఆల‌యానికి పరుగులు తీశాడు. త‌న సోద‌రుడు చెప్పిన‌ట్లుగానే ఆమె త‌ల‌ రక్తపుమడుగులో ప‌డి ఉండ‌టంతో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
 
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి పూట మృతురాలి మూడో కుమారుడైన 35 ఏళ్ల‌ నారాయణ అనే వ్య‌క్తి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. స‌దరు నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడ‌ని, అలా చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని దేవత త‌న‌తో చెప్పింద‌ని అన్నాడ‌ని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments