Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడనాడు ఎస్టేట్‌ను అమ్మ, చిన్నమ్మ లాగేసుకున్నారు.. 150 మంది గూండాలను పంపించి..?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ కలిసి కొడనాడు ఎస్టేట్‌ను బలవంతంగా అసలు యజమాని నుంచి లాక్కున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అమ్మ మరణం తర్వాత తమిళనాడు సంచలనాలకు నెలవుగా మారిపోయింది. ఈ నేపథ్

Webdunia
సోమవారం, 29 మే 2017 (14:07 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ కలిసి కొడనాడు ఎస్టేట్‌ను బలవంతంగా అసలు యజమాని నుంచి లాక్కున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అమ్మ మరణం తర్వాత తమిళనాడు సంచలనాలకు నెలవుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అమ్మ, చిన్నమ్మలు కొడనాడు ఎస్టేట్‌ను తన వద్ద నుంచి బలవంతంగా లాగేసుకున్నారని.. దాని అసలు యజమాని పీటర్ కర్ల్ ఎడ్వార్డ్ క్రెగ్ జోన్స్ ఆరోపించడం సంచలనానికి దారితీసింది. అయిష్టంగానే తన ఎస్టేట్‌ను వారికి ఇవ్వాల్సి వచ్చిందని.. అయితే కొడనాడు ఎస్టేట్‌ను తిరిగి పొందేందుకు న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 
 
పనిలో పనిగా జయలలిత కొడనాడు ఎస్టేట్‌ను ఎలా సొంతం చేసుకున్నారనే విషయాన్ని క్రెగ్ జోన్స్ తెలిపారు. 1990లో కొడనాడు ఎస్టేట్‌కు అమ్మాలని జయలలిత సన్నిహితులు, శశికళ, అన్నాడీఎంకే నేతలు కొంత మంది రెండేళ్లపాటు ఒత్తిడి తీసుకొచ్చారని జోన్స్ వెల్లడించారు. కానీ వారి బలవంతంతో అయిష్టంగా కొడనాడు ఎస్టేట్‌ను అమ్మాల్సి వచ్చిందన్నారు. 
 
ఈ క్రమంలో కొడనాడు ఎస్టేట్‌ను తీసుకుంటూ కేవలం రూ.7.5కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన డబ్బు ఎగ్గొట్టారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొంతమంది వ్యాపారవేత్తలు, మంత్రులు, అధికారులు, అన్నాడీఎంకే విధేయుడు రాజు రత్నమ్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్ళకుండా.. చెన్నైలోని మద్యం వ్యాపారి ఉదయార్ ఇంట్లో భాగస్వామ్య మార్పిడి పత్రాలపై సంతకాలు చేసినట్లు జోన్స్ వెల్లడించారు.
 
సంతకాలు చేసిన తర్వాత రోజే ఎస్టేట్‌ను మా నుంచి సొంతం చేసుకున్నారని జోన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది గూండాలను పంపి, ఫోన్లలో బెదిరించి ఈ ఎస్టేట్‌ను శశికళ వర్గీయులు అమ్మకు సొంతం చేశారని, అయితే ఈ వ్యవహారంలో జయలలిత ప్రత్యక్షంగా పాలు పంచుకోలేదన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments