Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వ్యాపమ్'పై సీబీఐ విచారణ జరిపించండి.. చౌహాన్ : సుప్రీంకోర్టు బోనులో వ్యాపమ్ పిటీషన్లు!

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (13:55 IST)
మధ్యప్రదేశ్ వ్యవసాయక్ పరీక్షా మండల్ (వ్యాపమ్) స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. మరోవైపు వ్యాపమ్ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన 8 పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వీటన్నింటిపై ఈనెల 9వ తేదీన విచారణ జరుపనుంది.
 
ఈ స్కామ్‌లో ఇప్పటివరకు 48 మంది అనుమానాస్పదంగా మృతి చెందిన విషయంతెల్సిందే. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో వరుసగా ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకర జర్నలిస్టు కాగా, మరొకరు వైద్య కాలేజీ డీన్, ఇంకొకరు మహిళా ట్రైనీ ఎస్సై ఉన్నారు. ఈ మృతులతో వ్యాపమ్ స్కామ్‌పై దేశవ్యాప్తంగా చర్చ ఆరంభం కావడంతో పాటు... సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. 
 
వీటిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కోట్ల రూపాయల వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టును కోరారు. ఈ మేరకు ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టుకు లేఖ రాస్తున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు ఈ స్కాంతో సంబంధం ఉన్న పలువురు వరుసగా చనిపోతుండటంతో సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ ఇప్పటికే కోర్టులో పిటిషన్లు దాఖలదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 9 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వీటిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌లు దాఖలు చేసిన పిటీషన్లు కూడా ఉన్నాయి. వీటిన్నింటిపై ఈ నెల 9న వాటిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments