Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకర్స్ ఛేజ్ : సింహాలతో చెడుగుడు... (వీడియో)

పులి కనిపిస్తే పరుగో పరుగు. సింహం గాండ్రింపు వింటే ఒళ్లంతా వణుకే.. అలాంటిది ఆ కుర్రోళ్లు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలో గిర్ అటవీ ప్రాంతం విస్తర

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (16:53 IST)
పులి కనిపిస్తే పరుగో పరుగు. సింహం గాండ్రింపు వింటే ఒళ్లంతా వణుకే.. అలాంటిది ఆ కుర్రోళ్లు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలో గిర్ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పులుల సంరక్షణలో భాగంగా ఇక్కడ అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 
 
దీంతో ఇటీవల పులులు, సింహాల సంఖ్య గిర్ అటవీ ప్రాంతంలో బాగా పెరిగింది. సుమారు 400 పులులు, సింహాలు ఉన్నట్లు సమాచారం. అలాంటి ప్రాంతంలో నలుగురు యువకులు.. రెండు బైక్స్‌పై సింహం పిల్లలను తరుముతూ.. వాటిని ఆట పట్టిస్తూ.. బైకులు చేసే శబ్దాలు, ఆ యువకుల అరుపులకు భయపడిన సింహం పిల్లలు పరిగెడుతూ ఉంటాయి. అయినా వదిలిపెట్టకుండా ఆ యువకులు వాటిని వెంబడిస్తున్నారు. 
 
ఈ వీడియో చర్చనీయాంశం అవ్వటంతో గుజరాత్ అటవీ శాఖ విచారణ చేపట్టింది. ఆ యువకులు ఎవరు.. ఏ ప్రాంతం వారు అనే విషయాలపై ఆరా తీస్తోంది. బండి నెంబర్లు ఆధారంగా రాజ్‌కోట్ ప్రాంతం వారిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం