Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు ఎలా ఉందో చూశారా? (Video)

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (19:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో కనిపించిన మోనాలిసా ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే, యూపీలోని ఆమె ఇల్లు ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ మహాకుంభమేళాలో ఓ సుందరి తళుక్కున మెరిసిన విషయం తెల్సిందే. ఈ సుందరి ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. నల్ల పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముకునే ఈ యువతి ఫోటో, వీడియోను ఓ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. 
 
అదేసమయంలో ఈ మత్తుకళ్ల మోనాలిసాకు సినిమా ఆఫర్లు కూడా వరిస్తున్నాయి. ఇప్పటికే ఓ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన తదుపరి చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. ఒక వేళ ఆమెకు నటన రాకుంటే శిక్షణ ఇప్పించి నటింపజేస్తానని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కే ఆర్సీ-16లో కూడా మోనాలిసాకు సినిమా అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆర్సీ-16 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారన్న అంశంపై క్లారిటీ లేదు. కానీ, టాలీవుడ్‌లో మాత్రం మత్తుకళ్ల సుందరికి సినిమా ఛాన్స్ మాత్రం ఖాయమనే ప్రచారం సాగుతోంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments