Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండుటెండలో ఇంటి ముందు భోజనం చేసిన విజయ్ కాంత్... కసురుకున్న రైతన్న

డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్‌కు ఈరోడ్‌లో విచిత్ర అనుభవం ఎదురైంది. సతీమణి ప్రేమలతతో కలిసి విజయ్‌కాంత్ ఈరోడ్‌లోని సెన్నిమ‌లై మీదుగా ఓ ఆల‌యానికి వెళ్లారు. అయితే మ‌ధ్యాహ్య భోజ‌న స‌మ‌యం కావ‌డంతో మార్గ‌మ‌ధ్యంల

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (12:09 IST)
డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్‌కు ఈరోడ్‌లో విచిత్ర అనుభవం ఎదురైంది. సతీమణి ప్రేమలతతో కలిసి విజయ్‌కాంత్ ఈరోడ్‌లోని సెన్నిమ‌లై మీదుగా ఓ ఆల‌యానికి వెళ్లారు. అయితే మ‌ధ్యాహ్య భోజ‌న స‌మ‌యం కావ‌డంతో మార్గ‌మ‌ధ్యంలో కారును ఓ పెంకుటిల్లు వ‌ద్ద ఆపి అక్క‌డ ఉన్న ఖాళీ ప్ర‌దేశంలో అరిటాకులు ప‌రుచుకుని ఇంటి నుంచి తెచ్చుకున్న భోజ‌నాన్ని వ‌డ్డించుకున్నారు. ఎండ దంచేస్తుండ‌డంతో విజ‌య‌కాంత్ త‌న త‌ల‌పై తలపాగా చుట్టుకున్నారు. 
 
అప్పుడే పొలం నుంచి వచ్చిన ఇంటి యజమాని వారిని చూసి ఎవరు మీరు..? ఇక్కడ భోజనం ఎందుకు చేస్తున్నారంటూ కసురుకున్నాడు. కానీ దగ్గరకొచ్చి చూసిన రైతు షాక్ అయ్యాడు. వారు సాక్షాత్తు డీఎండీకే చీఫ్‌, న‌టుడు విజ‌యకాంత్‌, ఆయ‌న స‌తీమ‌ణి ప్రేమ‌ల‌త కావ‌డంతో నోట‌మాట రాలేదు. ఆ త‌ర్వాత తేరుకుని ఇంట్లో నుంచి మ‌రిన్ని వంట‌కాలు, స్వీట్లు తెచ్చి వారికి వ‌డ్డించాడు. 
 
రైతు అభిమానానికి ముగ్ధు‌లైన వారు వాటిని కూడా ఆర‌గించారు. స్థానికులు వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఇంటి యజమాని అయిన రైతుకు థ్యాంక్స్ చెప్పి విజయ్ కాంత్, ప్రేమలత కారులో వెళ్ళిపోయారు. అయితే విజయ్‌కాంత్ వెళ్ళిపోయాక అక్కడికి చేరుకున్న స్థానికులు విజయ్‌కాంత్‌ను చూడలేక నిరాశతో తిరుగుముఖం పట్టారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments