Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కోతి పెట్రోల్‌కు బానిస... ఎక్కడ (వీడియో)

ఓ కోతి పెట్రోల్‌కు బానిస అయింది. వివిధ రకాల ఆహార పదార్థాలు ఇస్తున్నా కోతి ఆరగించడం లేదు. కానీ, పెట్రోల్ మాత్రం గటగటా తాగేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... హర్యానా రాష్ట్రంలోని పానిపట్ పట్టణంలో ఇన్సార

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (11:25 IST)
ఓ కోతి పెట్రోల్‌కు బానిస అయింది. వివిధ రకాల ఆహార పదార్థాలు ఇస్తున్నా కోతి ఆరగించడం లేదు. కానీ, పెట్రోల్ మాత్రం గటగటా తాగేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... హర్యానా రాష్ట్రంలోని పానిపట్ పట్టణంలో ఇన్సార్ బజార్ అనే ఏరియా ఉంది. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. దీంతో రోజూ వేలాది మంది ఈ ఏరియాకు వచ్చి పోతుంటారు. ఇటీవల పార్కింగ్ చేసిన బైక్స్ నుంచి పెట్రోల్ మాయమైపోవడాన్ని గుర్తించారు. 
 
అలా షాపులోకి వెళ్లి వచ్చేసరికి బండిలో పెట్రోల్ ఖాళీ అయ్యేది. మొదట ఎవరైనా దొంగతనం చేస్తున్నారని అనుమానించారు. కానీ, ప్రతి రోజూ ఇలానే జరుగుతుండటంతో పెట్రోల్ చోరీపై ప్రత్యేక నిఘా పెట్టగా, అసలు విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. 
 
పార్కింగ్ చేస్తున్న బైక్స్ నుంచి పెట్రోల్ మాయం చేసేది చోరులు కాదనీ, ఓ కోతి అని తెలుసుని ఆశ్చర్యపోయారు. పార్కింగ్ చేసే స్కూటర్లలోని పెట్రోల్ ట్యాంక్ ట్యూబ్ లాగేసుకుని.. చక్కగా నోట్లో పెట్టుకుని తాగేస్తుంది. ఈ విషయం గమనించిన స్థానికులు దానికి ఆహారం అందించానికి ప్రయత్నించారు. అరటిపండ్లు, ఇతర ఆహార పదార్ధాలు ఇస్తున్నా తీసుకోవటం లేదు. కేవలం పెట్రోల్ మాత్రమే తాగుతుంది. 
 
అక్కడి నుంచి దాన్ని తరిమేస్తున్న రోజూ మధ్యాహ్నం సమయంలో వచ్చి కనిపించిన బండ్లలోని పెట్రోల్ తాగేసి వెళ్లిపోతుంది. ఎవరైనా వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తే.. వాళ్లపై దాడికి దిగుతుంది. రోజూ కోతి బాధ భరించలేక ఆ ప్రాంతంలో బైక్స్ పార్కింగ్ చేయటమే మానేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments