Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హిందువులను 100 శాతం చేయడమే టార్గెట్ : ప్రవీణ్ తొగాడియా

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (14:25 IST)
భారత్‌లో హిందువులను 100 శాతంగా చేయడమే తమ లక్ష్యమని వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. ఒకపుడు ప్రపంచంలో హిందువులు మాత్రమే ఉండేవారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇపుడు హిందూ దేశమైన భారత్‌లో 82 శాతం మంది హిందువులు ఉన్నారని, ఈ సంఖ్యను వంద శాతానికి చేరుస్తామని తెలిపారు. 
 
దేశ వ్యాప్తంగా సాగుతున్న మతమార్పిడులపై తీవ్రమైన చర్చ, రచ్చ జరుగుతున్న నేపథ్యంలో తొగాడియా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపేలా ఉన్నాయి. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇండియాలో హిందువుల జనాభాను తగ్గించి మైనారిటీలుగా చేయాలన్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. 
 
గతంలో కొందరి బలవంతంమీద మతాలను మార్చుకున్న వారు తిరిగి హిందూ మతంలోకి రావచ్చని, ఇందుకోసం 'ఘర్ వాపసి' పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. కాగా, ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో 500 మంది గిరిజనులను హిందూ మతంలోకి మార్చినట్టు వీహెచ్‌పీ ప్రకటించిన విషయం తెల్సిందే. వీరంతా నిరుపేద క్రైస్తవులు, ముస్లింలుగా కొనసాగుతూ వచ్చారని ప్రకటించింది.a

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments