Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమాస్తుల కేసు రూ.100కోట్ల జరిమానా.. జయలలిత ఆస్తుల స్వాధీనం..?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ జైలు జీవనం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టు రూ.100 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ

Webdunia
గురువారం, 10 మే 2018 (11:45 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ జైలు జీవనం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టు రూ.100 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాను వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జయలలిత ఆస్తుల స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 
 
కాగా 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆదాయానికి మించిన రూ.66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో పాటు జయలలిత నిచ్చెలి శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా ఈ అక్రమాస్తుల వ్యవహారంలో సంబంధం ఉందంటూ కేసు నమోదైంది. సుమారు 20 సంవత్సరాలపాటు విచారణ జరిగిన ఈ కేసులో 2017 ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 
జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ నలుగురూ అక్రమాస్తులను కూడబెట్టినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. కానీ 2016లోనే జయలలిత మృతి చెందటంతో ఆమెకు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు తలా నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017లో కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో జయలలితకు విధించిన రూ.100 కోట్ల జరిమానాను వసూలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నిందితులైన నలుగురి ఆస్తులను స్వాధీనం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసుకుంటోంది. 
 
ఇందులో తొలి విడతగా వారికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏఏ ఆస్తులు ఉన్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే 128 ఆస్తులను ప్రభుత్వం స్తంభింపజేసింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు చెందిన 68 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ప్రస్తుతం జయలలితకు విధించిన జరిమానాను వసూలు చేసే దిశగా అధికారులు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments