Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ హీరోయిన్ వర్సెస్ కంగనా రనౌత్? ఏం జరుగుతోందా తెలుసా? (video)

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (15:38 IST)
ఇటీవలి కాలంలో కంగనా రనౌత్ కి మహారాష్ట్ర సర్కారుకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తెలిసిందే. కంగనా రనౌత్ తనదైన శైలిలో మహా సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదనీ, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధంగా వున్నానంటోంది. సహజంగా సినీ తారలను ఎదుర్కోవాలంటే అదే రంగంలోని వారికే సాధ్యమంటుంటారు. అందుకేనేమో శివసేన ఇప్పుడు కొత్త ఫార్ములా అప్లై చేయబోతోంది.
 
అదేంటయా అంటే... వర్మ రంగీలా హీరోయిన్ ఊర్మిళా మంతోడ్కర్‌ను ఎమ్మెల్సీగా రంగంలోకి దింపనున్నట్లు భోగట్టా. ఈ విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో కాంగ్రెస్ నుంచి నార్త్ ముంబై నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
 
ఆ తర్వాత ఆ పార్టీకి రాంరాం చెప్పేసారు. ఈ నేపధ్యంలో ఆమెకి ఎమ్మెల్సీ బెర్త్ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. పనిలో పనిగా కంగనా రనౌత్ ను ఎదుర్కొనేందుకు ఊర్మిళ సరిపోతుందనే అభిప్రాయాలు శివసేనలో వ్యక్తమవుతున్నాయట. చూడాలి వర్మ హీరోయిన్‌కి ఆ ఛాన్స్ వస్తుందో లేదో?

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments