Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు...

వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (15:59 IST)
దేశంలో వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు కేవలం పగటి పూట మాత్రమే నడిపేందుకు అనువుగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే, వీటికి లభిస్తున్న ఆదరణ చూసిన రైల్వే శాఖ స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్ళ తయారీపై దృష్టిసారించింది. ఈ స్లీపర్‌ ట్రైన్‌ను మరో రెండు నెలల్లో అంటే ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తొలి స్లీపర్ క్లాస్ వందే భారత్ రైలును కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రారంభించిన అన్ని వందే భారత్ రైళ్ళకు ఆయనే జెండా ఊపి ప్రారంభించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్‌ రైలు పనులను పర్యవేక్షించడానికి బెంగళూరు వెళ్లారు. వందేభారత్ స్లీపర్ రైలు తయారీ చివరిదశలో ఉందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ రైలు ఢిల్లీ, ముంబై రైల్వే మార్గంలో నడుస్తోందని, రద్దీగా ఉండే ఈ మార్గంలో స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. స్లీపర్‌ ట్రైన్‌ ఢిల్లీ నుంచి భోపాల్‌, సూరత్‌ మీదుగా ముంబై చేరుకుంటుందని తెలిపాయి. 
 
త్వరలో పట్టాలెక్కనున్న ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్‌ స్లీపర్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి. గంటకు 130 కి.మీ. వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని కొద్ది రోజుల అనంతరం క్రమంగా గంటకు 160-220 కి.మీ.లకు పెంచుతామని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments