త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఠాగూర్
బుధవారం, 15 అక్టోబరు 2025 (15:37 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొత్త వెర్షన్ వందే భారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇపుడు కొత్తగా వందే భారత్ 4.0 వెర్షన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సీఐఐ ఇంటర్నేషనల్‌ రైల్‌ కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుందని, ఇందుకోసం వందేభారత్‌ 4.0 (Vande Bharat 4.0)ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్‌గా మార్చేదిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి సారించిందని వెల్లడించారు. 11 ఏళ్లలో 35,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగిందని చెప్పారు. జపాన్ బుల్లెట్ రైల్ నెట్‌వర్క్‌ మాదిరిగానే హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. గరిష్ఠంగా గంటకు 350 కి.మీ వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments