Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ : ప్రధాని మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారింది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారి భారతీయ జనతా పార్టీని విజయతీరాలకు చేర్చింది. పర్వతాలు, గంగా, యమునా నదుల మధ్య కొలువుదీరి ఉన్న దేవ భూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (16:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారి భారతీయ జనతా పార్టీని విజయతీరాలకు చేర్చింది. పర్వతాలు, గంగా, యమునా నదుల మధ్య కొలువుదీరి ఉన్న దేవ భూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసివచ్చింది.
 
దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృత స్థాయి ప్రచారం కాషాయ జెండా రెపరెపలకు కారణమైంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, ఆ పార్టీ నుంచి మాజీ సీఎం విజయ్ బహుగుణ సారథ్యంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం హస్తవాసి క్షీణించిపోవడానికి మరో కారణంగా కనిపిస్తున్నది.
 
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 36 సీట్లు. కానీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఆ మ్యాజిక్ సంఖ్యను దాటిపోయింది. బీజేపీకి 56 సీట్లు, కాంగ్రెస్‌కు 11, ఇతరులకు 2 సీట్లు చొప్పున రాగా, ఒక స్థానం ఫలితం రావాల్సి ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో బీజేపీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments