Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేముంటే సూసైడ్ చేసుకుందాం రా... నిరాకరించిన యువతి గొంతు కోసిన ప్రియుడు

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (15:42 IST)
నిజంగా నామీద ప్రేమ వుంటే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం రా అంటూ ప్రియురాలిని ప్రియుడు పిలిచాడు. దీనికి ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ప్రియుడు.. ప్రియురాలిని అత్యంత పాశవికంగా గొంతుకోశాడు. ఈ  దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా ఖాకేగఢ్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మోరినా జిల్లాలోని చిచ్చవాలి గ్రామానికి చెందిన హేత్‌ సింగ్‌ తోమర్ ‌(21) అనే యువకుడు అదే యూపీలోని ఖాకేగడ్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఆమెతో మాట్లాడేందుకు ఓ మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చాడు. 
 
ఈ క్రమంలో నవంబరు 30వ తేదీన తనను కలవాలని యువతిని సింగ్‌ ఆదేశించాడు. ఆ సమయంలో మరో అబ్బాయితో యువతి కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన సింగ్‌.. యువతికి ఫోన్‌ చేసి నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. తన మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం అని యువతికి సింగ్‌ చెప్పాడు.
 
అందుకు ఆ యువతి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన తోమర్.. ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని అక్కడే పడేసి.. ఆగ్రా నుంచి మోరినాకు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత తోమర్‌ సింగ్‌ పురుగుల మందు తాగి ఖీరాఘర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. 
 
ఆ యువతిని తానే చంపానని చెప్పేందుకు సింగ్‌ పోలీసుల వద్దకు వెళ్లాడు. కానీ అతడిని పోలీసు స్టేషన్‌ నుంచి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే సింగ్‌ ప్రాణాలు విడిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments