Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళసూత్రం తాకట్టు పెట్టి... మరుగుదొడ్డి నిర్మించిన ఉత్తరప్రదేశ్ మహిళ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేపట్టరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అలాగే, ఆయా ప్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (14:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేపట్టరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అలాగే, ఆయా ప్రభుత్వం తమ వంతు మేరకు మరుగుదొడ్లను నిర్మిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి మరుగుదొడ్డి నిర్మించుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బరేలీ జిల్లాకు చెందిన గులారియా భవానీ అనే 31 ఏళ్ల మహిళకు భర్త ఇద్దరు పిల్లలున్నారు. తాము నివాసమున్న గ్రామం అటవీ ప్రాంతంలో ఉండటంతో ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెట్లలోకి వెళ్లాలంటే వన్యప్రాణులతో ప్రమాదాలు పొంచివున్నాయి. దీంతోపాటు వర్షాల వల్ల మైదానంలో నీరు నిలచి ఉండటం వల్ల అవస్థలు పడాల్సి వస్తున్నందున ఎలాగైనా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని స్థిర నిర్ణయానికి వచ్చానంటారు. 
 
ఇందుకోసం ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. కానీ, వారి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఆరువేల రూపాయల వడ్డీకి రుణం తీసుకొని తన వద్ద ఉన్న మరో వేయి రూపాయలు కలిపి ఏడువేలతో భవానీ ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 ఏళ్లకు తర్వాత భార్యకు విడాకులిచ్చిన ఏఆర్ రెహ్మాన్

చైనాలో 40వేల థియేటర్లలో విజయ్ సేతుపతి మహారాజ చిత్రం విడుదల

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments