Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ శాఖ లీలలు... పేదోడి ఇంటికి రూ.128 కోట్ల కరెంట్ బిల్లు

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (17:17 IST)
సాధారణంగా పేదోడి ఇంటికి ఓ ఫ్యాన్, ఓ లైటు ఉంటాయి. వీటిని ఉపయోగిస్తే మహా అయితే వంద లేదా రెండు వందల రూపాయల మేరకు కరెంట్ బిల్లు వస్తుంది. కానీ, ఆ పేదోడి ఇంటికి మాత్రం అక్షరాలా రూ.128 కోట్ల బిల్లు వచ్చింది. ఈ బిల్లును చూడగానే కుటుంబ యజమానికి గుండె ఆగినంత పని అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హపూర్‌కు చెందిన షమీమ్ అనే వృద్ధుడు తన భార్యతో కలిసి ఓ చిన్నపాటి ఇంటిలో నివసిస్తున్నాడు. ఒక రోజు కరెంట్ వాళ్లు వచ్చి.. కనెక్షన్ కట్ చేస్తుంటే ఎందుకని షమీమ్ ప్రశ్నించాడు. మీ బిల్లు చూడలేదా.. ఆ మొత్తం కట్టే వరకు కనెక్షన్ ఇచ్చేది లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
తీరా, తన ఇంటి కరెంట్ బిల్లును నిశితంగా పరిశీలిస్తే గానీ ఆయన అసలు విషయం అర్థంకాలేదు. బిల్లు చూడగానే ఆయన గుండె ఆగినంతపని అయింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే... అదంతా తెలియదు బిల్లు కట్టాల్సిందేనని పట్టుబట్టారు. నెత్తినోరు మొత్తుకున్నా అక్కడ వినేవాడే లేకుండా పోయాడు. 
 
చివరకిది ఆ నోటా.. ఈ నోటా పడి.. మీడియాకు చేరడంతో అసలు విషయం బయటపడింది. అదంతా సాంకేతిక సమస్య కారణంతో జరిగిందని అధికారులు చేతులు దులిపేసుకున్నారు. కరెంట్ కనెక్షన్ అందిస్తామని తెలిపారు. అధికారుల తీరుపై షమీమ్ మండిపడ్డాడు. కరెంట్ వాళ్లు తమ ఇంటికేగాక.. మొత్తం హపూర్ నగరం బిల్లంతా తనకే ఇచ్చారని షమీమ్ ఎద్దేవా చేస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments