Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిరాక్స్ కోసం వెళ్లిన ఇద్దరు మైనర్లపై అత్యాచారం.. ఎక్కడ?

Uttar Pradesh
Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (08:49 IST)
జిరాక్స్ తీసుకునేందుకు వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికు గురయ్యారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటన ఈ నెల 13వ తేదీన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 13వ తేదీన ఇద్దరు మైనర్ బాలికలు కన్నౌజ్‌లోని ఓ సైబర్ కేఫ్‌కు జిరాక్స్ తీయించుకోవడానికి వెళ్లారు. ఆ బాలికలను నలుగురు వ్యక్తులు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారాన్ని నిందితులు వీడియో తీశారని, ఈ ఘటన బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించినట్లు 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
అనంతరం రూ.10 వేలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. దీంతో తాను, తన మిత్రురాలు కలసి తమ ఇళ్లలో దొంగతనం చేసి డబ్బు చెల్లించినట్లు చెప్పారు. డబ్బు పోయిన సంగతిని తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా, అత్యాచారం విషయం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. 
 
కేఫ్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు కూడా తేలిందన్నారు. చుట్టుపక్కల వారు సైతం ఆ కేఫ్‌ వద్ద యువతులను పలు మార్లు చూసినట్లు చెప్పారని పేర్కొన్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాళ్ళ ఫిర్యాదు మేరకు ఓ మహిళ సహా మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్‌ వర్మ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments