ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్ళిపోయిందని.. ఆ చర్యతో పరువుపోయిందని భావించిన ఆ యువతి కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్ళిపోయిందని.. ఆ చర్యతో పరువుపోయిందని భావించిన ఆ యువతి కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు.
పరువు పోయిందనే ఉద్దేశంతో.. దిగజారారు. ప్రేమికుడితో పారిపోయిందని.. యువతిపై రక్తం పంచుకుని పుట్టిన సోదరుడు, జన్మనిచ్చిన తండ్రి, ఆపై ఇద్దరు మావయ్యలు అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ముజఫర్ నగర్‌లోని దందేడా గ్రామానికి చెందిన ఒక యువతి తన ప్రియుడితో కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. ఇంటి నుంచి వెళ్ళిపోవడం ద్వారా తమ పరువు తీసిందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు.. కక్ష్య పెంచుకుని.. ఆమె కోసం తీవ్రంగా గాలించారు.
ఎలాగోలా ఆమె చిరునామా తెలుసుకున్న తండ్రి, సోదరుడు ఇంట్లోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో బాధితురాలు కుమిలిపోతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేయించుకున్నారు.