Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రాలేదనీ బావమరిదిని కిడ్నాప్ చేసిన భర్త...

భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త... తన బావమరిదిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (09:51 IST)
భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త... తన బావమరిదిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఫిరోజాబాద్ జిల్లా రసూల్‌పురా గ్రామానికి చెందిన సౌరభ్ (29), రత్నేష్ (27) అనే దంపతులు ఉన్నారు. ఈ భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు ఏర్పడుతున్నాయి. దీంతో భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రత్నేష్ పుట్టింటికి వెళ్లి పోయింది. 
 
ఆ తర్వాత అత్తారింటికి వెళ్లిన సౌరభ్... కాపురానికి రాకుంటే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడమేకాకుండా తన బావమరిది దేవేంద్రను కిడ్నాప్ చేశాడు. బావమరిదిని కిడ్నాప్ అతన్ని తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రత్నేష్ పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవేంద్రను ఢిల్లీ రైల్వేస్టేషనులో గుర్తించి కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. నిందితుడైన సౌరభ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments