Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ కట్నం తెచ్చిందనీ భార్యను గర్రా నదిలో తోసేసిన భర్త... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే నేరాలు ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన భార్య తక్కువ మొత్తంలో కట్నం తెచ్చిందన్న అక్కసుతో ఆమెను నదిలో తోసేశాడు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే నేరాలు ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన భార్య తక్కువ మొత్తంలో కట్నం తెచ్చిందన్న అక్కసుతో ఆమెను నదిలో తోసేశాడు. అయితే, ఆ వివాహిత అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి గట్టెక్కింది. ఈ దారుణం యూపీలోని షాజన్‌పూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
షాజహాన్‌పూర్ పట్టణానికి చెందిన ఆకాష్‌కుమార్ అదే పట్టణానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్నాడు. తక్కువ కట్నం తీసుకువచ్చిందని కోపంతో ఆకాష్ కుమార్ తన సోదరుడు వదినతో కలిసి అంజలిని కొట్టి గర్రా నదిలోకి తోసేశాడు. తీవ్ర గాయాలతో అంజలి నది ఒడ్డున అపస్మారక స్థితిలో పడివుండగా స్థానికులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సృహలోకి వచ్చిన అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను తక్కువ కట్నం తీసుకువచ్చానని భర్త ఆకాష్‌కుమార్ అతని సోదరుడు, సోదరుడి భార్య కలిసి తనను కొట్టి నదిలో పడేశారని అంజలి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... భర్త ఆకాష్ కుమార్‌తో పాటు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments