Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఇద్దరమ్మాయిలపై పోకిరీల అకృత్యాలు.. తాకరాని చోట తాకుతూ.. తడుముతూ వీడియో

మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బెంగళూరులో కొత్త సంవత్సరాది రాత్రి ఒంటరిగా నడిచి వెళ్తున్న యువతిని ఆ రోడ్డున వెళ్ళే ఇద్దరు పోకిరీలు లైంగికంగా వేధించిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్

Webdunia
సోమవారం, 29 మే 2017 (12:53 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బెంగళూరులో కొత్త సంవత్సరాది రాత్రి ఒంటరిగా నడిచి వెళ్తున్న యువతిని ఆ రోడ్డున వెళ్ళే ఇద్దరు పోకిరీలు లైంగికంగా వేధించిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై నడిచి వెళ్తుంటే.. 14 మంది పోకిరీగాళ్లు వారిని చుట్టుముట్టారు. వీరిలో ఒకమ్మాయిని లక్ష్యంగా చేసుకుని లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా వీడియో తీసి మరీ నెట్లో అప్‌లోడ్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాంపూర్‌ జిల్లా తండా పోలీస్ స్టేషన్‌ పరిధి సన్నని కాలిబాటలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళిన ఇద్దరమ్మాయిలపై 14 మంది పోకిరీగాళ్లు ఓవరాక్షన్ చేశారు. ఒకమ్మాయినే లక్ష్యం చేసుకుని తాకరాని చోట్ల తాకుతూ, తడుముతూ, పట్టుకుని లాగేస్తూ, తోసేస్తూ, అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ దారుణంగా వ్యవహరించారు. 
 
పైగా ఈ అకృత్యాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియోగా ఆన్ లైన్‌లో పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే లైంగిక వేధింపులకు పాల్పడిన 14మందిలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం