Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పరీక్షకు నిరాకరించాడనీ కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 మే 2020 (13:36 IST)
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు ఓ వ్యక్తి నిరాకరించాడు. దీంతో ఆ వ్యక్తిని కొందరు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్‌లోని మలక్‌పూర్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన మంజీత్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీలో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో తన మలక్ పూర్ గ్రామానికి ఇటీవలే చేరుకున్నాడు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోవాలని మలక్ సింగ్‌ను అతని కజిన్స్ కపిల్‌, మనోజ్‌ కోరారు. 
 
అయితే, ఈ పరీక్షలు చేయించుకునేందుకు మలక్ సింగ్ ససేమిరా అన్నాడు. దీంతో మంజీత్‌తో కజిన్స్ గొడవపడి కర్రలతో దాడి చేశారు. మంజీత్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, మంజీత్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
ఈ ఘటనపై అతడి తల్లి దండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. మంజీత్‌ కజిన్స్‌ కపిల్‌, మనోజ్‌తో పాటు వారి తల్లి పుణియా, మనోజ్‌ భార్య డాలీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవల మంజీత్ సింగ్ బిజ్నూర్‌కు చేరుకున్నాక అతడికి థర్మల్‌ స్కానింగ్ చేశామని, నెగిటివ్‌ రావడంతో అతని శాంపిల్స్‌ తీసుకోలేదని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments