Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన పోలీస్ కానిస్టేబుల్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (11:43 IST)
పీకల వరకు మద్యం సేవించిన ఓ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ ఒకరు చెప్పుతోకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హార్దోయ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దినేశ్ ఆత్రీ అనే కానిస్టేబులో శనివారం సాధారణ దుస్తుల్లో మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి పీకల వరకు మద్యం సేవించి మార్కెట్‌కు వచ్చిన మహిళలతో పాటు ఇతరులను ఇబ్బందులు పెట్టడాన్ని చూశాడు. పైగా, ఉచితంగా శీతలపానీయం ఇవ్వాలంటూ వ్యాపారులను విసిగించాడు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ ఆత్రీ అతన్ని నివారించేందుకు ప్రయత్నించగా, వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ పట్ల ఆ తాగుబోతు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నోటికి పని చెప్పాడు. 
 
దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్.. తన కుడికాలి బూటను తీసుకుని పదేపదే కొట్టాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ అయింది. ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్పీ దుర్గేశ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, ఇందులో దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ఆత్రీని తక్షణం సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments