Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి బరాత్‌లో తుపాకీతో కాల్పులు.. మిస్ ఫైర్.. యువకుడి మృతి (video)

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (15:00 IST)
సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్లు ఒక వంతు. సంప్రదాయానికి ప్రస్తుతం ట్రెండింగ్, ఫ్యాషనై తోడయ్యే పెళ్లిళ్లు మరోవైపు. తాజాగా పెళ్లి వేడుక అనంతరం నిర్వహించిన బరాత్‌లో బంధుమిత్రులు అందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గడుపుతోన్న సమయంలో పెళ్లి కొడుకు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
 
అనంతరం ఆ తుపాకీని జేబులో పెట్టుకుంటోన్న సమయంలో అది మిస్‌ఫైర్ అయి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి ఓ కెమెరాలో రికార్డయ్యాయి.
 
సోన్‌భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్‌లో మనీశ్ మధేషియా అనే యువకుడి పెళ్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బరాత్ సమయంలో మనీశ్‌ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం ఓ బుల్లెట్ అతడి స్నేహితుడు, ఆర్మీ జవాను బాబులాల్ యాదవ్‌కు తగిలింది. 
 
ఆ తుపాకీ కూడా బాబులాల్ యాదవ్‌దే. అతడిని ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

సాయి కుమార్ కీ రోల్ చేసిన ప్రణయ గోదారి చిత్రం రివ్యూ

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments