Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌' హోదా రద్దు.. సింధు ఒప్పందంపైనా నీలినీడలు.. భారత్ ఆంక్షలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భారత ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే దౌత్యపరంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచిన భారత, ఆర్థికంగానూ పాక్‌ను ఇ

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (09:19 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భారత ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే దౌత్యపరంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచిన భారత, ఆర్థికంగానూ పాక్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా పాకిస్థాన్‌కు ప్రకటించిన మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎంఎఎఫ్‌ఎన్‌) హోదాను రద్దు లేదా స్థాయి తగ్గించే చర్యలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌ మెఘావాల్‌ స్పష్టంచేశారు. 
 
అలాగే, భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని (ఇండస్‌ వాటర్‌ ట్రీటి - ఐడబ్ల్యూటీ) కూడా రద్దు చేసుకొనే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్‌ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింధు జలాల ఒప్పందం రద్దు అంశంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూర్చుతున్నాయి. 
 
ఐడబ్ల్యూటీ ఒప్పందాన్ని ప్రపంచంలోనే అత్యంత లోపభూయిష్టమైన ఒప్పందంగా అంతర్జాతీయ నిపుణులు చెబుతుంటారు. ఆరు నదులు కలిగిన సింధు నదీ వ్యవస్థలో బియాస్‌, రావి, సట్లెజ్‌ నదులపై భారతకు, సింధు, చీనాబ్‌, జీలం నదులపై పాకిస్థాన్‌కు హక్కులు కలిగివున్న విషయం తెల్సిందే. ఈ ఒప్పందం మేరకు పాకిస్థాన్ 80 శాతం జలాలను వినియోగించుకుంటోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments