Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి ఝలక్ ఇచ్చిన ఉపేంద్ర : మంత్రి పదవికి గుడ్‌బై

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:02 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహ్ తన పదవికి రాజీనామా చేశారు. 
 
ఈయన బీహార్ రాష్ట్రంలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన నేత. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో పాటు దానిమిత్రపక్ష పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోంది. ఈ సీట్ల పంపణీ సరిగాలేదని పేర్కొంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర మంత్రిపదవికి కూడా రాజీనామా చేశారు. 
 
బీహార్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామనీ, కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా అమలుచేయలేకపోయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు త‌న లేఖ‌లో తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ ఎంపీ సీట్ల‌లో కేవ‌లం రెండు సీట్లు మాత్ర‌మే కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణ‌యించారు. దీంతో కేంద్ర‌మంత్రి ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. అదేసమంయలో ఆయన సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మంతనాలు జరిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments