Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ కలలో మాటిచ్చావ్ కదా.. నా పెళ్లి సంగతేంటి.. నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు!

దేశంలో ఉన్న మెస్ట్ బ్యాచిలర్ ఎవర్బా అని ఎవరినైనా అడిగితే వారు ఠక్కున చెప్పే సమాధానం ఒక్కటే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని. ఆయన పెళ్లి గురించి వస్తున్న పుకార్లు అన్నీఇన్నీకావు.

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (14:26 IST)
దేశంలో ఉన్న మెస్ట్ బ్యాచిలర్ ఎవర్బా అని ఎవరినైనా అడిగితే వారు ఠక్కున చెప్పే సమాధానం ఒక్కటే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని. ఆయన పెళ్లి గురించి వస్తున్న పుకార్లు అన్నీఇన్నీకావు. 
 
అలాంటి రాహుల్‌కు ఓ మహిళ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదంటూ ప్రశ్నించింది. అంతేనా... రాహుల్‌ తనను ఎందుకు పెళ్లి చేసుకోవాలో పలు కారణాలను కూడా మీడియా ముందు పెట్టేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ఈ గుర్తుతెలియని మహిళ కాంగ్రెస్ సేవా దళ్ కార్యకర్తగా చెబుతున్నారు.
 
యువనేతకు తన ''ప్రేమను'' వెల్లడి చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముందు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తన 'కలల రాకుమారుడి' గురించి చెబుతానంటూ మొదలు పెట్టి... ''దళితులతో సహపంక్తి భోజనం చేయడం.. దళితులకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో రాహుల్‌కి వీరాభిమాని అయ్యాను.
 
నేను ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తినయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్నాను... ఆయన నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు!'' అని అడిగేసింది. రాహుల్‌ని పెళ్లి చేసుకునేందుకు 2006 నుంచే ఆలోచనలు చేస్తున్నానని చెప్పింది.
 
అప్పట్లో తనకు రాహుల్ అంటే చిన్నపాటి నమ్మకమే ఉండేదనీ... అయితే 2014లో పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన పట్ల తన నమ్మకం మరింత బలపడుతూ వచ్చిందని తెలిపింది. అప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో రాహుల్ గాంధీని చూసినట్టు పేర్కొంది. 
 
ఇంతకీ రాహుల్‌ని ఎందుకు పెళ్లిచేసుకోవాలనుకుంటున్నావని మీడియా ప్రతినిధులు అడిగితే... ''ఆయన చాలా మంచివాడు.. ప్రధానమంత్రి కొడుకు.. మంచి నాయకుడు.. రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి'' అని లిస్టు చదవడం మొదలుపెట్టింది.
 
ఆయనేమైనా మాటిచ్చారా ఏమిటని ప్రశ్నిస్తే... ''ముఖా ముఖిగా ఏమీ మాట్లాడలేదుగానీ... తరచూ కలలో కనిపించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు'' అని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన సమాధానాలకు మీడియా మిత్రులే షాక్‌కు గురయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments