Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి యువకుడి జననాంగాలను కోసేసిన వివాహిత

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (10:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. పొరుగింటి యువకుడిని ఇంటికి పిలిపించి అతని జననాంగాలను కోసేసింది. ఇంట్లో కొద్దిగా పని ఉందని, అది చేసిపెట్టేందుకు ఇంటికి రావాలని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లక్నో సమీపంలోని షరీఫ్‌పూర్‌కు చెందిన ఓ మహిళ పొరుగింటిలో ఉండే ఓ యువకుడిని ఇంటిలో కొంచెం పని ఉందని చెప్పి ఇంటికి పిలిపించింది. దీంతో ఆమె ఇంటికి ఆ యువకుడు వెళ్ళాడు. ఈ క్రమంలో కొద్దిసేపటికి వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత అతడి జననాంగాలను ఆ మహిళ కొసేసింది. పక్కంటి మహిళ ఇంటికి వెళ్లిన కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో యువకుడి తల్లి ఆ మహిళ ఇంటికి వెళ్లి చూడగా, కొడుకు అపస్మారక స్థితిలో పడివున్నాడు. 
 
ఆ వెంటనే ఇరుగుపొరుగువారి సాయంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ నుంచి ప్రయాగ్ రాజ్ ‌నగరంలోని మరో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ యువకుడి జననాంగాలను కట్ చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆమె వద్ద పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments