నాపై అత్యాచారం జరిగింది.. ఇదిగోండి.. పిండం.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా?

ఉత్తరప్రదేశ్‌లో ఓ అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు తన ఐదు నెలల పిండాన్ని ఓ బ్యాగులో వేసుకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాను అత్యాచారానికి గురైయ్యానని.. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవ

Webdunia
సోమవారం, 23 జులై 2018 (14:22 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు తన ఐదు నెలల పిండాన్ని ఓ బ్యాగులో వేసుకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాను అత్యాచారానికి గురైయ్యానని.. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గర్భస్రావం కావడంతో ఆ పిండాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... యూపీ, అమ్రోహా జిల్లాకు చెందిన 19ఏళ్ల యువతిని మనోజ్ (22) అనే యువకుడు ఐదు నెలల క్రితం బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సాకుతో మళ్లీ మళ్లీ ఆ యువతిని లొంగదీసుకుని బెదిరించాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. అయితే ఆమె కుటుంబీకులు యువతికి గర్భస్రావం చేయించారు. 
 
దీంతో ఆగ్రహానికి గురైన యువతి పోలీస్ స్టేషన్‌కు పిండంతో సహా వచ్చింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. పిండమే ఇందుకు సాక్ష్యమని బ్యాగును చూపెట్టింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. మనోజ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న మనోజ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments