Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టు చేస్తాలేగానీ... ముందు గదికి వచ్చి నా పక్కలో పడుకో : బాధితురాలితో ఎస్ఐ

తనపై అత్యాచారం చేసినవాళ్లు మళ్లీ వేధిస్తున్నారు.. వారిని అరెస్టు చేయండి ప్లీజ్ సార్ అంటూ ఓ ఎస్ఐను ఆశ్రయించిన రేప్ బాధితురాలికి ఊహించిన ఘటన ఎదురైంది. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆ బాధితురాలు... తనదైనశైలిలో

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (09:53 IST)
తనపై అత్యాచారం చేసినవాళ్లు మళ్లీ వేధిస్తున్నారు.. వారిని అరెస్టు చేయండి ప్లీజ్ సార్ అంటూ ఓ ఎస్ఐను ఆశ్రయించిన రేప్ బాధితురాలికి ఊహించిన ఘటన ఎదురైంది. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆ బాధితురాలు... తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రామ్‌పూర్‌కి చెందిన మహిళ (37) గత ఫిబ్రవరి 12న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అమీర్‌ అహ్మద్‌ (55), సత్తార్‌ అహ్మద్‌ (45) అనే వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆమె నేరుగా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించింది. ఆయన ఆదేశాల మేరకు పలు అభియోగాలు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
 
నిందితులను అరెస్టు చేయక పోవడంతో వారు దర్జాగా తిరుగుతూ వారు ఆమెను మరింతగా వేధించడం మొదలెట్టారు. దీంతో ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్.ఐ. జైప్రకాశ్ సింగ్ ఆమెతో... ‘వారిని అరెస్టు చేయాలంటే ముందు నువ్వు నా కోరిక తీర్చు... నాకు ఫోన్ చేసి, నా గదికి ఒంటరిగా రా.. .నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే వారిని అరెస్టు చేస్తాను' అంటూ ఆఫర్ ఇచ్చాడు. 
 
దీంతో అతని మాటలన్నిటినీ రికార్డు చేసిన ఆమె నేరుగా వాటిని సీడీ రూపంలో తయారు చేసి ఎస్పీకి అందజేసింది. దీంతో అతనిని విధుల నుంచి తప్పించి, దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. ఫలితంగా ఎస్ఐ తిక్కకుదిరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం