Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

సెల్వి
మంగళవారం, 6 మే 2025 (19:21 IST)
యూపీలో పదుల సంఖ్యలో కోతులు మరణించాయి. మధుర జిల్లా అన్యూర్ గ్రామంలో ఉక్రెయిన్ వాసుడు స్థానికుడితో కలిసి.. పదుల సంఖ్యలో కోతుల్ని హతమార్చాడు. ఎయిర్‌గన్‌తో ఈ దారుణానికి పాల్పడగా 60 కోతులు చనిపోగా మరిన్ని గాయపడ్డాయి. స్థానికుడు జానకీ దాస్, నిందితుడు బ్రజ్ సుందర్ దాస్ (ఉక్రేనియన్ జాతీయుడు) అదుపులోకి తీసుకున్నట్లు గోవర్ధన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రవి త్యాగి తెలిపారు. 
 
ఈ సంఘటన గురించి స్థానికులు సమాచారం అందించగానే ఘటన స్థలానికి చేరుకున్న గోవర్ధన్ పోలీసులు.. స్థానిక పశువైద్యశాల బృందాన్ని పిలిపించారు. చనిపోయిన కోతులను పోస్ట్‌మార్టం కోసం పంపించి, గాయపడిన జంతువులకు చికిత్స చేశారు. ఈ జీవహింసపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
రాధా మదన్ మోహన్ దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న ఉక్రేనియన్ జాతీయుడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎయిర్ గన్ ఉపయోగించి కోతులను కాల్చి చంపాడని స్థానికులు ఆరోపించారు. గత నెలలో ఈ ప్రాంతంలో దాదాపు 60 కోతులు చనిపోయాయని నివాసితులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments