Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 రోజుల బిడ్డతో విధులకు హాజరైన ఐఏఎస్ అధికారిణి!

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఐఏఎస్ అధికారిణి రోజుల బిడ్డతో విధులకు హాజరైంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిని సౌమ్యా పాండే. ఈమె ప్రయాగ్ రాజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, ఈమె సరిగ్గా 23 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ప్రశూతి మహిళకు ఆర్నెల్ల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఈ సెలవు కాలాన్ని ఆమె వినియోగించుకోలేదు కదా.. ఏకంగా రోజుల బిడ్డతో తన కార్యాలయానికి వచ్చి విధుల్లో నిమగ్నమైంది. దీనికి కారణంత తన విధుల పట్ల ఆమెకున్న అంకితభావం. కర్తవ్యం. 
 
తన వడిలో చంటిబిడ్డను కూర్చోబెట్టుకుని ఆమె విధులను నిర్వహిస్తున్న ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌమ్యా పాండే, యూపీలోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. ప్రసవం తర్వాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తుండటాన్ని పలువురు అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments