'ఆ' సుఖానికి నిరాకరించింది.. అందుకే స్నేహితులతో కలిసిచంపేశా...

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:29 IST)
గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నామనీ, అయితే, తనతో శారీరకంగా కలిసివుండేందుకు తన ప్రియురాలు నిరాకరించడంతో తన స్నేహితులతో కలిసి చంపేసినట్టు ఓ హత్యాచార కేసులోని ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పాడు. 
 
ఈ హత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరాబంకి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బరాబంకి జిల్లాలో 17 ఏళ్ల మైనర్‌ యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
 
ఈ క్రమంలో గత రెండు రోజులుగా కూతురు కనిపించకపోవడంతో ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు... ఆ యువతి ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని స్టేషన్‌కు పిలిచి విచారించగా అసలు విషయాన్ని వెల్లడించాడు.
 
యువతి, తాను గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నామని, ఇటీవల తనను కలిసేందుకు, శారీరక సుఖం పంచుకునేందుకు నిరాకరించసాగిందని, అందుకే తన స్నేహితునితో కలిసి హత్య చేసినట్లు వెల్లడించాడు. అయితే, హత్యకు ముందు.. ఆ యువతిపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి శవాన్ని నీటి కాలువలో పడేసినట్టు వెల్లడించారు. 
 
దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితులపై హత్యా, సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments