ఆవును కొట్టాడనీ భార్యాపిల్లల ముందే వ్యక్తిని కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (10:23 IST)
తన ఇంటి ముందుకు వచ్చిన ఆవును ఓ వ్యక్తి కర్రతో కొట్టాడు. దీన్ని ఆవు యజమాని చూశాడు. అంతే.. ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అంతే.. ఆవును కొట్టిన వ్యక్తిని పట్టుకుని అతని భార్యాపిల్లల ముందే కొట్టి చంపేశారు. ఈ దారుణం కాన్పూరులో జరిగింది. 
 
తాజాగా దారుణానికి సంబంధించి గోవింద్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణంలోని మహదేవ్ నగర్ బస్తీలో ఆయుష్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన గోవు, రమణ గుప్తా (46) అనే వ్యక్తి ఇంటి ముందుకు వచ్చింది. 
 
ఆ సమయంలో గుప్తా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వారు భయపడుతుండటంతో, ఓ కర్రను చేతపట్టుకుని గోవును అదిలిస్తూ కొట్టాడు. ఈ ఘటనను చూసిన ఆయుష్ యాదవ్, రమణ గుప్తాతో గొడవకు దిగాడు. 
 
ఆపై కర్ర తీసుకుని వచ్చి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో రమణ గుప్తా తీవ్రంగా గాయపడగా, బంధువులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ప్రధాన నిందితుడు ఆయుష్ యాదవ్ తన కుటుంబంతో సహా పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై మృతుడి భార్య స్పందిస్తూ, చిన్న కారణానికే తన భర్తను హత్య చేశారని బోరున విలపిస్తూ వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments